UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 బాదాం అన్ని సీజన్లలోనూ సూపర్ ఫుడ్‌

బాదాం అన్ని సీజన్లలోనూ సూపర్ ఫుడ్‌గా నిలుస్తోంది. తగిన పోషకాహారం అందడానికి బాదాం గింజలను మీ డైట్‌లో తరచుగా తీసుకోవాలి. డయాబెటిస్, గుండె జబ్బులు, రక్తపోటు ఉన్న పేషెంట్లు తప్పక బాదాంలను తీసుకోవాలి. విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, కాపర్, రైబోఫ్లావిన్ తదితర విటమిన్లు, ఖనిజలవణాలకు బాదాం గింజలు పెట్టింది పేరు. బాదాం గింజలను తినడం వల్ల గుండె జబ్బులు తగ్గడమే కాక బ్రెయిన్ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. అయితే ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే బాదాం గింజలను రాత్రి నానబెట్టి ఉదయం పరగడపున తినాలి. ఎన్ని బాదాం గింజలు తినాలి? బాదాం గింజలు తింటే అనేక రోగాలు పారిపోతాయని మనకు తెలుసు. అయితే ఎన్ని తినాలన్న విషయంలో చాలా మంది గందరగోళపడుతుంటారు. రోజుకు 6, 8, 22.. ఇలా ఎన్ని తినాలన్న విషయంలో స్పష్టత లేక ఇబ్బందిపడుతుంటారు.

అయితే అమెరికన్ డైటరీ మార్గదర్శకాల ప్రకారం రోజుకు ఒక ఔన్స్ (28.3 గ్రాములు) బాదాం గింజలు తినొచ్చు. అంటే దాదాపు 23 బాదాం గింజలు తినొచ్చు. అయితే చాలా మంది జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయక అరగవు. అలాంటి వారు 20 వరకు పరిమితం చేసుకోవడం మంచిది. జీర్ణ వ్యవస్థ సామర్థ్యాన్ని బట్టి వ్యక్తికీ వ్యక్తికీ ఈ పరిమాణం మారుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ డిక్సా భవ్‌సర్ ఇటీవల ఒక ఇన్‌స్టా పోస్టులో చెప్పారు. తొలుత నానబెట్టిన 2 బాదాం గింజలతో ప్రారంభించొచ్చని చెప్పారు. తరువాత క్రమంగా వాటిని పెంచుకోవచ్చని సూచించారు. ‘ఆల్మండ్స్, ఇతర నట్స్ జీర్ణం కావడం ఒకింత కష్టం. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్ ఉంటాయి. విటమిన్ ఈ, కాల్షియం, కాపర్, మెగ్నీషియం, రైబోఫ్లావిన్ ఉంటాయి. ఐరన్, పొటాషియం, జింక్, బి విటమిన్స్, నియాసిన్, థయామిన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి..’ అని ఆమె చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !