సినీ పరిశ్రమలో కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హిట్ కాంబినేషన్ సినిమా అంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. మరి అలాంటిది స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, ఎన్టీఆర్ లు నటిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఊహకే బాక్సాఫీస్ భద్దలు అవ్వడం ఖాయం అనిపిస్తుంది. త్వరలోనే రాజమౌళి ప్రభాస్, ఎన్టీఆర్ తో పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేస్తున్నట్లు సమాచారం. తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన డైరెక్షన్లో ఒక్క సినిమా అయిన చేయాలని హీరోలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఆస్కార్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. ఎలాగైనా ఈసారి ఇండియాకు ఆస్కార్ తీసుకురావాలని కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనూ ఆసక్తికరమైన ఒక వార్త నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంది. ప్రభాస్, ఎన్టీఆర్ లు మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా చేశాడు. ఇక ఇప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా చేయడం పెద్ద విషయం కాదు అని అంటున్నారు. ntr and prabhas combination movie with Rajamouli direction పైగా ప్రభాస్ కు, ఎన్టీఆర్ కు రాజమౌళితో ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఆ బాండింగ్ తోనే వీరిద్దరితో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే, ఆది పురుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా షెడ్యూల్లో బిజీగా ఉన్నాడు. ఇక రాజమౌళి మహేష్ బాబు తో అడ్వెంచర్ మూవీని తీసేందుకు బిజీగా ఉన్నాడు. కథను కూడా తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పూర్తి చేయిస్తున్నట్లు తెలుస్తుంది. వీరి సినిమాలు పూర్తి అయితే గాని ప్రభాస్ ఎన్టీఆర్ ల సినిమాపై క్లారిటీ రాదు.