ప్రస్తుతం నటసింహం బాలయ్య క్రేజ్ మామూలుగా లేదు. స్టార్ హీరోగా ఎదిగిన బాలయ్య ఓటీటీలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా చేస్తూ మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ సెలబ్రిటీ టాక్ షోనీ ఓటీటి స్థాయినీ, ఫాలోయింగ్ ని అమాంతం పెంచేశాడు. అంతేగాక మొదటి సీజన్ అయినప్పటికీ, అన్ స్టాపబుల్ షో నీ దేశంలోనే ఉత్తమ షో గా నిలిపాడు. అంతటి జోష్ కలిగిన బాలయ్య ఈ ఏడాది కూడా అన్ స్టాపబుల్ సీజన్ 2 ని సక్సెస్ గా నడిపిస్తున్నాడు. ఫస్ట్ సీజన్ ను మించి సెకండ్ సీజన్ మంచి సక్సెస్ గా దూసుకెళ్తుంది. సినిమాలలో పవర్ఫుల్ డైలాగ్స్ తో సినిమాని హిట్ చేయడం బాలయ్యకు కొత్త ఏమీ కాదు. కానీ హోస్ట్ గా షోలు చేయడం కొత్త. అయినా తనదైన స్టైల్ లో షో లు చేస్తూ దుమ్ము లేపుతున్నాడు. అలాంటి బాలయ్య పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తే షో మామూలుగా ఉండదు అని అనుకుంటున్నారు.
అంతకుముందు సీజన్ల నుండి నాగార్జున హోస్టుగా చేస్తూ వస్తున్నాడు. ఇటీవల బిగ్ బాస్ 6 సీజన్ లను పూర్తి చేసుకుంది. దాదాపుగా బిగ్ బాస్ మూడో సీజన్ నుండి హోస్ట్ గా నాగార్జున చేస్తున్నాడు. అయితే బాలయ్య ఎంట్రీ తో ఊహించనీ రేంజ్ కి వెళ్ళిన ఆహా ని bigg boss season 7 host Balakrishna చూసి మిగతా చానల్స్ కూడా బాలయ్య తో షో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో బిగ్ బాస్ లోకి హోస్ట్ గా బాలయ్య రానున్నాడని టాక్ వస్తుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 టిఆర్పి రేటింగ్స్ బాగా డ్రాప్ అవడంతో, బిగ్ బాస్ టీమ్ బాలయ్యను దించాలని ఆలోచిస్తున్నారట. దీనికి బాలయ్య కూడా ఓకే అన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈసారి ఫైనల్స్ లో నాగార్జున మళ్ళీ కలుద్దాం అని అనలేదు. దీంతో బాలయ్య బిగ్ బాస్ సీజన్ 7 కి వస్తాడని అనుకుంటున్నారు. దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. పక్కాగా హోస్ట్ గా అయితే మారిపోతున్నాడని తెలుస్తుంది.