బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేవంత్ అని జనాలు ఫిక్స్ అయిపోయారు. ఆ విధంగానే సింగర్ రేవంత్ టైటిల్ గెలుచుకున్నాడు. రేవంత్ ప్రవర్తన పరంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే తన ఆట తీరుతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ప్రతి టాస్కులో తనే విన్నర్ కావాలని తాపత్రయం పడేవాడు. ఈ క్రమంలో అతడి కోపం హద్దులు దాటింది. తన తోటి కంటెస్టెంట్స్ ని తిట్టడం, దెబ్బలు తగిలేలా ఆడటం చేసేవాడు. దీంతో రేవంత్ పై విమర్శలు వచ్చాయి. అతనిలో నెగిటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ సరైన పోటీ లేకపోవడంతో ఎప్పటినుంచో ఉన్న ఫ్యాన్ బేసిక్ తో అతడు గెలిచాడు. ఈ సీజన్లో సింగర్ రేవంత్ కి ఉన్న పాపులారిటీ ఎవరికీ లేదు. అతనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అతడిని మద్దతుగా నిలిచింది. ఈ కారణాలతో రేవంత్ ఫైనల్ కి చేరుకున్నాడు. చివరి నిమిషంలో కూడా అందరూ రేవంత్ గెలుస్తాడని అనుకున్నారు. తనతోటి కంటెస్టెంట్స్ కూడా ఇదే అభిప్రాయం వెల్లడించారు.
అయితే ఫైనల్ రిజల్ట్ అందరూ అభిప్రాయాలు తప్పని తేల్చింది. ఆడియన్స్ రేవంత్ కాదు శ్రీహాన్ టైటిల్ విన్నర్ గా గెలవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారని నాగార్జున తెలిపారు. చాలా తక్కువ మార్జిన్ తో ఓట్లలో రేవంత్ పై శ్రీహాన్ పై చేయి ఎక్కువగా ఉందని అన్నారు. దీంతో అందరికీ ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. కేవలం 40 లక్షలకు ఆశపడి టైటిల్ ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశాన్ని శ్రీహాన్ కోల్పోయాడు. Bigg Boss 6 Telugu trap srihan big story happens రేవంత్ ని విన్నర్ చేయకపోతే భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకున్న బిగ్బాస్ తెలివిగా శ్రీహాన్ ను ఇరికించారు. ఇప్పటికే ఎలిమినేషన్స్ ఫేక్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో రేవంత్ కంటే శ్రీహాన్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయంటే ఎవరు నమ్మరు. శ్రీహాన్ని విన్నర్ చేస్తే పెద్ద మొత్తంలో నెగెటివిటీ ఎదుర్కోవాల్సి వస్తుంది అని శ్రిహాన్ నీ ట్రాప్ చేసి రేవంత్ ని టైటిల్ విన్నర్ చేయాలని ప్లాన్ వేశారు. అందుకే ప్రైజ్ మనీకి సమానమైన 40 లక్షలు ఆఫర్ చేశారు. సాధారణంగా 25 లక్షలు ఆఫర్ చేయడమే ఎక్కువ. మొత్తానికి బిగ్ బాస్ తనపై నెగెటివిటీ రాకుండా శ్రీహాన్ ని ట్రాప్ చేశారని తెలుస్తుంది.