UPDATES  

 తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వారసులు గట్టి సవాలే

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వారసులు గట్టి సవాలే విసురుతున్నారు. గతంలో టీడీపీలో యాక్టివ్ గా పనిచేసిన చాలామంది నాయకులు ఫేడ్ అవుట్ అయ్యారు. అటువంటి నేతల్లో మాజీ స్పీకర్ ప్రతిభాభారతి ఒకరు. శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు గ్రూపుల మధ్య ఆమె సమిధగా మారిపోయారు. రాజకీయంగా కోలుకోలేని దెబ్బతిన్నారు. గత ఎన్నికల్లో రాజాం రిజర్వ్ స్థానాన్ని ఆశించిన ప్రతిభాభారతిని చంద్రబాబు పక్కన పెట్టేశారు. అప్పటి వరకూ కాంగ్రెస్ లో ఉన్న మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ ను బరిలో దించారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ప్రజల నుంచి నిరాదరణే ఎదురైంది. ఇక్కడ మరోసారి కోండ్రు మురళీమోహన్ పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అటు చంద్రబాబు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్టు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో సవాల్ విసురుతున్నారు ప్రతిభాభారతి కుమార్తే గ్రీష్మ ప్రసాద్. వచ్చే ఎన్నికల్లో తానూ పోటీచేస్తానని కుండబద్దలుకొట్టి మరీ చెబుతున్నారు. Greeshma Prasad ఈ మధ్యన గ్రీష్మ ప్రసాద్ కాస్తా యాక్టివ్ అయ్యారు. అటు పార్టీ సభలు, సమావేశాలతో పాటు టీవీ డిబేట్ లో కూడా పాల్గొంటున్నారు.

దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వాయిస్ పెంచుకుంటూ వస్తున్నారు. ఆమె ఉన్నట్టుండి తాను కూడా రాజాం నుంచి బరిలో దిగుతానని చెబుతున్నారు. అప్పటివరకూ అచ్చెన్నాయుడు గ్రూపులో కొనసాగిన తల్లీ కుమార్తెలు ఇప్పుడు కళా వెంకటరావు పంచన చేరడం ప్రారంభించారు. ఇప్పటికే కోండ్రుకు అచ్చెన్నాయుడితో పాటు పార్టీ హైకమాండ్ మద్దతు ఉందన్న ప్రచారం నేపథ్యంలో తల్లీ కుమార్తెలు గోడ దూకారారు. అచ్చెన్న శిబిరం నుంచి కళా వెంకటరావు శిబిరంలోకి దూకేశారన్న టాక్ నడుస్తోంది. రాజాంలో చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో బలప్రదర్శనకు సిద్ధపడుతున్నారు. అయితే గ్రీష్మ దూకుడుపై హైకమాండ్ కోపంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. మొన్నటికి మొన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే డిబేట్ కు వెళ్లిన తల్లీ కూతుళ్లు పార్టీ నాయకత్వాన్ని తలవంపులు తెచ్చేలా మాట్లాడారు. 2019 ఎన్నికలు మిస్సయ్యింది? 2024 ఎన్నికల్లో అవకాశం అందుకుంటారా? అని ఆర్కే ప్రశ్నించేసరికి అంతే దూకుడు గ్రీష్మ సమాధానమిచ్చారు. అది చంద్రాబే తేల్చుకోవాలన్నారు. స్థిరంగా ఉండేవారు కావాలా? లేకుంటే జంపింగ్ జపాంగ్ లు కావాలో? తేల్చుకోవాలని సెటైరికల్ గా మాట్లాడారు. గత మూడున్నరేళ్లుగా అక్కడ కోండ్రు పనిచేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీచేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ టీవీ డిబేట్ లు, టీడీపీ అమరావతి సమావేశాలకే గ్రీష్మ పరిమితమయ్యారు. ఆమె ఉన్నట్టుండి తాను కూడా పోటీదారునని ప్రకటించేసరికి రాజాం నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఏదైనా ఉంటే పార్టీ అధినేత వద్ద మాట్లాడాలే కానీ.. ఇలా టీవీ డిబేట్ లో పార్టీ అధినేత గురించి పలుచన చేయడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. Greeshma Prasad ఆ మధ్యన మహానాడులో గ్రీష్మ ఆవేశపూరితంగా మాట్లాడారు. తొడగొట్టి మరీ సవాల్ చేశారు. అప్పటివరకూ ప్రతిభాభారతి కుమార్తెగా ఉన్న ఆమె మహానాడును బాగానే వర్కవుట్ చేసుకున్నారు. ఆమె దూకుడును ఉపయోగించుకోవాలని భావించిన హైకమాండ్ పార్టీ పదవి ఇచ్చింది. కానీ ఆమె టీవీ డిబేట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఆత్మరక్షణలో పడేశారు. దీంతో హైకమాండ్ టీవీ డిబేట్లలో పాల్గొనే విషయంలో కొన్నిరకాల షరతులు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇప్పుడు చంద్రబాబు రాజాం నియోజకవర్గంలో పర్యటించే సమయానికి నేను టిక్కెట్ ఆశిస్తున్నానని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అటు కోండ్రు మురళీమోహన్ ను వలసపక్షిగా ఆరోపణలు చేసి.. ఎవరికి టిక్కెట్ ఇస్తారో చూసుకోండిఅని సవాల్ విసిరేదాకా గ్రీష్మ మాటలు కోటలు దాటుతున్నాయి. అనవసరంగా ఎంకరేజ్ చేశామని ఇప్పుడు పార్టీ పెద్దలు బాధపడేదాకా పరిస్థితి వచ్చిందట.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !