UPDATES  

 నేతల అవినీతి.. షాకిచ్చిన జేడీ.. ఏపీలో తీవ్ర సంచలనం

 

ఏపీ ముందంజలో ఉంది. అభివృద్ధిలో మాత్రం కాదు. అవినీతి, లంచగొండితనంలో. ప్రభుత్వ శాఖల్లో 93 శాతం అవినీతి ఉందని..64 శాతం మంది ప్రజలు తమ ఎమ్మెల్యేల పట్ల ఏమంత సంతృప్తిగా లేనట్టు కూడా వెల్లడైంది. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ దాదాపు 45 రోజుల పాటు సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను వెల్లడించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సేవలందించాల్సిన ప్రభుత్వ శాఖల్లో అవినీతి పేరుకుపోయిందన్నారు. దీనిని నియంత్రించకపోతే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటుచేయాల్సిన అవసరముందన్నారు. కార్యాలయాల్లో సంబంధం లేని వ్యక్తులను నియమిస్తే అవినీతిని, లంచగొండితనాన్ని కొంతవరకూ నియంత్రించే అవకాశముందని చెప్పుకొచ్చారు. JD Lakshminarayana ప్రభుత్వ శాఖల్లో విపరీతమైన అవినీతి ఉందని 54.6 శాతం మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్, మునిసిపల్, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్, విద్య శాఖలతో పాటు కాలుష్య నియంత్రణ మండలి బోర్డు, రాజకీయ నాయకులు, గ్రామ పంచాయతీల్లో అవినీతి జరుగుతున్నట్టు సర్వేలో వెల్లడైంది.

లంచం ఇవ్వనిదే పని జరగడం లేదని 39.7 శాతం మంది చెబితే..లంచం ఇవ్వని కారణంగా ఇబ్బందిపెడుతున్నారని 32.4 మంది చెప్పారు.ప్రభుత్వ కార్యాలయాల్లోఅధికారులు, సిబ్బంది పనితీరు అధ్వానంగా ఉందని 45 శాతం మంది చెప్పగా.. 36.3 శాతం మంది అస్సలు బాగాలేదని చెప్పారు. మధ్యవర్తుల ద్వారా లంచం తీసుకుంటున్న వారు 40.6 శాతం మంది ఉండగా.. మొత్తం అన్ని కోణాల్లో క్రోడీకరిస్తే 93 శాతం అవినీతి, లంచగొండితనం ఏపీ సమాజంలో ఉందని సీబీఐ మాజీ జేడీ వెల్లడించారు. JD Lakshminarayana ఎమ్మెల్యేల పనితీరు విషయానికి వస్తే 64 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారంటే వారి పనితీరు, ప్రజా వ్యతిరేకత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నిజాయితీగా పనిచేసిన ప్రజాప్రతినిధి గురించి అడుగగా… ప్రజలు మాజీ ఎమ్మెల్యే రాములను ప్రస్తావించారు. అటు గ్రామస్థాయిలోని సర్పంచ్ లు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం లంచాలు తీసుకుంటున్నట్టు సర్వే వెల్లడించింది, అయితే అవినీతిని మాత్రం అరికట్టకపోతే రాష్ట్ర అభివృద్ధని కబళిస్తుందని లక్ష్మీనారాయణ అన్నారు. అందుకు విలువైన సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ ల ఏర్పాటుచేసి..వాటికి ఆఫీసుతో సంబంధం లేని వ్యక్తులను నియమిస్తే లంచగొండుల ఆట కట్టించవచ్చన్నారు. అటు చట్టాలను కఠినంగా అమలుచేయడం ద్వారా కూడా నియంత్రించవచ్చని ప్రభుత్వానికి సూచించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !