ఏపీ మంత్రి రోజా మరో సారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019లో జగన్ సీఎం కానేకాడు ఇది నా శాసనం అంటూ వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్, జగన్ సీఎం అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ప్రగల్బాలు పలికాడు. జగన్ సీఎం అయ్యారు.. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్లను కూడా టచ్ చేయలేక పోయారు. పార్టీ పెట్టి అధ్యక్షుడు అయ్యి ఉండి రెండు చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం ఒక్క చోట కూడా గెలవలేక పోయాడు. గతంలో పార్టీ పెట్టారు..
ఇదొక పార్టీ. మిమ్మల్ని మాత్రమే కాదు మీ బ్రదర్ ని కూడా జనాలు నమ్మలేదు. సొంత ఊరిలోనే ఓడి పోయారు. మీ వాళ్లకే మీ మీద నమ్మకం లేదంటే ఇక అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఆయన కాళ్లపై నిలబడడు. ప్రజల్లోకి వెళ్తానంటున్న పవన్ కళ్యాణ్ కి వైసిపి నేతలను ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ప్రజలు దేహశుద్ధి చేయడం ఖాయం. పవన్ కళ్యాణ్ తన మాటలను అదుపులో పెట్టుకొని ఉంటే బాగుంటుందని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు.