UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 క్రిస్మస్ పార్టీ ఇచ్చిన చరణ్-ఉపాసన

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌కు ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ సక్సెస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ స్టార్. అయితే ఆయన సతీమణీ ఉపాసన తల్లి కాబోతుండటం అంతకంటే గొప్ప శుభవార్త. దీంతో ఈ దంపతులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ ఆనందంలో భాగంగా ఈ ఏడాది క్రిస్మస్‌ను ఘనంగా జరుపుకున్నారు. మెగా కజిన్స్‌ను అందర్నీ ఆహ్వానించి క్రిస్మస్ పార్టీ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా తమ కజిన్స్‌తో కలిసి రామ్ చరణ్ దంపతులు క్రిస్మస్ పార్టీ ఇస్తున్నప్పటికీ.. ఈ ఏడాది మాత్రం వారికి ప్రత్యేకంగా మారింది. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన ఫొటోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. మెగా కజిన్స్‌ అంటూ ఈ ఫొటోకు తన క్యాప్షన్‌ను జత చేసింది. ఈ పార్టీలో వీరంతా కలిసి సీక్రెట్ శాంటా ఆడారు.

అంతేకాకుండా సరదాగా విలువైన సమయాన్ని గడిపారు. ఈ పార్టీకి అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వారి ఇతర కజిన్స్ హాజరయ్యారు. వీరందర్నీ ఒకేచోట చూస్తుండటంతో ఈ వేడుక ఒక మెగా సెలబ్రేషన్‌గా మారిపోయింది. ఈ ప్యామిలీ పార్టీలో అల్లు అర్జున్ సతీమణీ స్నేహా రెడ్డి, రామ్ చరణ్ సిస్టర్స్ కూడా పాల్గొన్నారు. క్రిస్మస్ చెట్టుతో పాటు ఇతర అలంకరణ వస్తువులతో రామ్ చరణ్-ఉపాసన ఇంటిని చక్కగా డెకరేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ పోస్టుపై విశేషంగా స్పందిస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి తన కోడలు తల్లికాబోతన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అనంతరం ఉపాసన కూడా ఈ విషయాన్ని ఓ ఫొటోను షేర్ చేస్తూ తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్‌తో సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇది కాకుండా బుచ్చిబాబు సానం దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !