మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌కు ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ సక్సెస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ స్టార్. అయితే ఆయన సతీమణీ ఉపాసన తల్లి కాబోతుండటం అంతకంటే గొప్ప శుభవార్త. దీంతో ఈ దంపతులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ ఆనందంలో భాగంగా ఈ ఏడాది క్రిస్మస్‌ను ఘనంగా జరుపుకున్నారు. మెగా కజిన్స్‌ను అందర్నీ ఆహ్వానించి క్రిస్మస్ పార్టీ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా తమ కజిన్స్‌తో కలిసి రామ్ చరణ్ దంపతులు క్రిస్మస్ పార్టీ ఇస్తున్నప్పటికీ.. ఈ ఏడాది మాత్రం వారికి ప్రత్యేకంగా మారింది. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన ఫొటోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. మెగా కజిన్స్ అంటూ ఈ ఫొటోకు తన క్యాప్షన్‌ను జత చేసింది. ఈ పార్టీలో వీరంతా కలిసి సీక్రెట్ శాంటా ఆడారు.
అంతేకాకుండా సరదాగా విలువైన సమయాన్ని గడిపారు. ఈ పార్టీకి అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వారి ఇతర కజిన్స్ హాజరయ్యారు. వీరందర్నీ ఒకేచోట చూస్తుండటంతో ఈ వేడుక ఒక మెగా సెలబ్రేషన్‌గా మారిపోయింది. ఈ ప్యామిలీ పార్టీలో అల్లు అర్జున్ సతీమణీ స్నేహా రెడ్డి, రామ్ చరణ్ సిస్టర్స్ కూడా పాల్గొన్నారు. క్రిస్మస్ చెట్టుతో పాటు ఇతర అలంకరణ వస్తువులతో రామ్ చరణ్-ఉపాసన ఇంటిని చక్కగా డెకరేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ పోస్టుపై విశేషంగా స్పందిస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి తన కోడలు తల్లికాబోతన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అనంతరం ఉపాసన కూడా ఈ విషయాన్ని ఓ ఫొటోను షేర్ చేస్తూ తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్‌తో సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇది కాకుండా బుచ్చిబాబు సానం దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నారు.