భూములు ఎలా కొల్లగొట్టాలో ఏపీలో అధికార వైసీపీ నేతలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ భూమి అంటే వారికి హద్దే ఉండదు. ప్రైవేటు భూములైతే భయపెట్టి స్వాధీనం చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలకు మించి వెలుగుచూస్తున్నాయి. మొన్నటికి మొన్న విశాఖలోని భూములను ఏ విధంగా కైవసం చేసుకున్నారో అందరికీ తెలిసిన విషయమే.
దశాబ్దాలుగా విశాఖ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుకున్న ప్రభుత్వ భూముల్లో వేలకు వేలు కండోమ్స్ ప్యాకేట్లు పడేశారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలను పడేసి అక్కడ సంఘ విద్రోహక చర్యలు జరుగుతున్నాయని బయట ప్రపంచానికి చూపారు. అర్జెంట్ గా వాటిని వినియోగంలోకి తేకపోతే అక్కడ నేరాలు, ఘోరాలు జరిగిపోతాయని ప్రచారం చేశారు. ఎంచక్కా బినామీలతో భూములను చదును చేయించుకొని హస్తగతం చేసుకున్నారు.