UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 స్టైలిష్ లుక్ ఇలా పొందండి!

మనం వేసుకునే దుస్తులు మన అందాన్ని పెంచుతాయి, మన దుస్తులకు తగినట్లుగా యాక్సెసరీస్ ధరిస్తే మరింత స్టైలిష్ లుక్ వస్తుంది. ఫ్యాషన్ అభిరుచి కలిగిన వ్యక్తులకు శీతాకాలం ఉత్తమ సీజన్ అని చెప్పవచ్చు. ఈ సీజన్లో మన శరీరాన్ని కప్పేందుకు ఒకటికి మించిన వస్త్రాలను ధరించవచ్చు. వణికించే చలినుంచి తమని తాము రక్షించుకునేందుకు అందరూ స్వెటర్లు, హుడీలు ధరిస్తారు. ఇవి సరిగ్గా ధరిస్తే మీ లుక్ మరింత పెరుగుతుంది. అలాగే శీతాకాలంలో మఫ్లర్లు, స్కార్ఫులు కూడా చాలా మంది ధరిస్తారు. ఇవి కూడా చలి నుంచి రక్షిస్తూ వెచ్చదనాన్ని ఇవ్వడంతో పాటు మీకు ఆకర్షణీయమైన లుక్‌ను అందిస్తాయి. మీరు మఫ్లర్ చుట్టే విధానాన్ని బట్టి కూడా మీ ఫ్యాషన్ స్టేటస్ మార్చుకోవచ్చు. Muffler Styling Guide-

మఫ్లర్ ధరించేందుకు విభిన్న మార్గాలు ఫ్యాషనబుల్ లుక్ కోసం మీ మఫ్లర్‌లను ధరించడానికి విభిన్న మార్గాలను ఇక్కడ తెలుసుకోండి. ఓవర్ హ్యాండ్స్ హ్యాంగ్ ఇది చాలా సింపుల్ విధానం, చాలా మంది నాయకులు ఇదే విధానంలో తమ కండువాలను ధరిస్తారు. మెడ వెనక నుంచి మఫ్లర్ ధరించి రెండు భుజాల మీదుగా సమానంగా వదిలేయడం. మీ దుస్తులకు సరిపోయే మోనోక్రోమ్ రంగును ఎంచుకొని మఫ్లర్ అలా వదిలేస్తే మంచి లుక్ వస్తుంది. మీరు పై నుంచి కోట్ ధరిస్తే ఆ లుక్ మరింత పెరుగుతుంది. రౌండ్ నెక్ డ్రేప్ మీరు మీ మఫ్లర్‌ను మెడకు ఒక వరుస గుండ్రంగా, సౌకర్యవంతంగా చుట్టి, వాటి రెండు కొనలను మీ భుజాల మీదుగా ముందుకు వదిలేయడం. టీ షర్ట్స్ ధరించినపుడు ఇలా మఫ్లర్ చుట్టుకుంటే మీ లుక్ అదిరిపోతుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !