వామ్మో ఈ మాయదారి కరోనా మనల్ని ప్రశాంతంగా బ్రతికనిచ్చేలా లేదు. అవును.. కరోనా గురించి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది.
ఇండియాలోకి ఒమిక్రాన్ BF-7 వేరియంట్ ఎంట్రీ ఇచ్చింది. చైనాలో ప్రస్తుతం ఉన్న దారుణ పరిస్థితులకు కారణమైంది ఈ వేరియంటే. గుజరాత్‌లోని వడోదరలో ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళకు ఈ వేరియంట్ సోకినట్లు అధికారులు ధృవీకరించారు. జీనోమ్ సీక్వెనింగ్‌లో వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో సదరు మహిళతో పాటు మరో ముగ్గుర్ని ఐసోలేషన్‌కు తరలించారు. ఇప్పటివరకు భారత్‌లో 3 ఒమిక్రాన్ BF-7 వేరియంట్ కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్‌లో రెండు కేసులు నమోదు కాగా మరో కేసు ఒరిస్సాలో వెలుగుచూసింది. దీంతో వైద్యారోగ్య అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్‌పోర్టులలో హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్ టెస్ట్‌లు చేయాలని కేంద్రం ఆదేశించింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కంపల్సరీగా కరోనా టెస్ట్‌లు చేయాలని అధికారులు ఆదేశించారు. విస్తృత వేగంతో వ్యాప్తి చెందే గుణం ఉంది ఈ వేరియంట్‌కు. ఇంక్యుబేషన్ వ్యవధి కూడా తక్కువ