తెలుగు పరిశ్రమలో కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో పెద్ద పొజిషన్ కి చేరుకున్నాడు. మొదటగా సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ఆ తర్వాత మెల్ల మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సినీ ఇండస్ట్రీలోనే మోస్ట్ పాపులర్ కమెడియన్ పేరు సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో కమెడియన్ బ్రహ్మానందం తర్వాత ఆలీ పేరే ఎక్కువ వినిపిస్తుంది. అంతేకాకుండా ఎవరు ఊహించని విధంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తనదైన శైలిలో ముందుకు వెళుతూ పాలిటిక్స్ లో కూడా మంచి పేరును సంపాదించుకుంటున్నాడు.అయితే ఇటీవలే ఆలీ పెద్ద కూతురు వివాహం జరిగింది. ఇక ఆలీ తన కూతురు పెళ్లి కోసం ఎన్నో కోట్లు ఖర్చు చేశాడు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.
అంతేకాకుండా తన అల్లుడు డాక్టర్ అని, డబ్బు పరంగా పెద్ద సౌండ్ పార్టీ అంటూ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆలీతో సరదాగా షో ఫైనల్ ఎపిసోడ్ కి సుమ హోస్టుగా ఆలీ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ విడుదల అయింది. ఈ క్రమంలో ఆలీని సుమా మీ అల్లుడు డాక్టర్ కదా అని అడిగాడు. Comedian Ali son-in-law is not a doctor but the real truth that came out దానికి బదులుగా ఆలీ మా అల్లుడు రోబోటిక్ ఇంజనీర్ అని చెప్పాడు. అయితే అతని నాన్న, అన్న,వదిన, చెల్లి, బావ డాక్టర్స్ అని నా అల్లుడు మాత్రం రోబోటిక్ ఇంజనీర్ అని చెప్పుకొచ్చాడు. అలాగే నా అల్లుడు మనసున్న వ్యక్తి అని, అందుకే మేము మా కూతురిని ఇచ్చామని అంతేకానీ వాళ్ళ డబ్బును చూసి మేము ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. దీంతో ఆలీ అల్లుడు డాక్టర్ కాదనే వార్తలకు పుల్ స్టాప్ పడ్డది. ఏది ఏమైనా సరే ఆలీ తన కూతురికి మంచి వ్యక్తిని ఇచ్చి వివాహం చేశాడని అందరూ అంటున్నారు.