భారతీయ వంటల్లో తరతరాలుగా ఇంగువను ఉపయోగిస్తున్నారు. ఇది ఒక బలమైన వాసన కలిగిన సుగంధ ద్రవ్యం. ఇంగువ వేసిన వంట మంచి సువాసన, రుచిని కలిగి ఉంటుంది. ఇంగువకు ఉన్న ఔషధ గుణాల కారణంగా ఆయుర్వేద వైద్యంలోనూ దీనిని ఉపయోగిస్తారు. దీనిని ఘాడమైన వాసన కారణంగా కొంతమంది ఇంగువ వేసుకోవడంలో ఇష్టపడరు. కానీ, ఆహారంలో ఇంగువ (Asafoetida) కలిపి తీసుకోవడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు ఆంటారు. ఇంగువను వంటల్లో వేయడం అన్ని వేళలా కుదరకపోతే దీనిని పాలల్లో కలిపి కూడా తాగవచ్చు. ఇంగువ కలిపిన పాలను తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ముఖ్యంగా పైల్స్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గాలంటే ఇంగువ పాలు తీసుకోవడం వలన మెరుగైన పరిష్కారం లభిస్తుంది. చాలా కొద్ది మోతాదులో ఇంగువ తీసుకుంటే చాలు.
1 గ్రాము ఇంగువను ఒక గ్లాసు నీటిలో కొన్ని గంటలు నానబెట్టి అది కరిగాక ఒక టీస్పూన్ నీటిని పాలల్లో కలుపుకొని తాగవచ్చు. లేదా ఒక రోజుకు 250 మిల్లీ గ్రాముల ఇంగువను గోరువెచ్చని పాలలో కలుపుకొని రెండు పూటలా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. Hing Milk Health Benefits- ఇంగువ పాలతో ఆరోగ్య ప్రయోజనాలు ఇంగువ కలిపిన పాలు తాగటం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మెరుగైన జీర్ణక్రియ ఇంగువ జీర్ణక్రియకు చాలా సహాయపడుతుంది. మీరు జీర్ణక్రియను మెరుగుపరచాలనుకుంటే, ఇంగువ పాలను తీసుకోవచ్చు. ఇది అజీర్ణం, ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలను నివారిస్తుంది. ఊబకాయం నియంత్రణ అధిక శరీర బరువును నియంత్రించడానికి ఇంగువ పాలు తీసుకోవడం చాలా మంచి ఆప్షన్. పాలలో ఇంగువ కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. జలుబు నుంచి ఉపశమనం జలుబు, దగ్గు సమస్య తగ్గాలంటే ఇంగువ కలిపిన పాలను తాగవచ్చు. ఇది ఫ్లూ వంటి సీజనల్ సమస్యలకు దివ్యౌషధమని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.