UPDATES  

 చలికాలంలో వేడినిచ్చే, టేస్టీ రెసిపీలు

చలికాలంలో వేడినిచ్చే, టేస్టీ రెసిపీలు తీసుకుంటాం. ఎందుకంటే ఇవి మనలో వెచ్చదనాన్ని పెంచుతాయి. అంతేకాకుండా సూప్​లోని పదార్థాలు మనకి పలురకాల ఫ్లూ నుంచి రక్షణనిస్తాయి. మీరు కూడా అలాంటి సూప్ తీసుకోవాలి అనుకుంటే గార్లిక్ చికెన్ సూప్​ని తయారు చేసుకోవచ్చు. మరి దీనిని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో.. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు * వెల్లుల్లి రెబ్బలు – 10 * బాదం పప్పులు – 5 * పార్ల్సీ – 15 గ్రాములు * బేలీఫ్ – 1 * చికెన్ బ్రాత్ – 4 కప్పులు (చికెన్ ఉడకబెట్టిన పులుసు) * జాజికాయ – చిటికెడు * గుడ్డులోని పచ్చసొన – 1 * హెవీ క్రీమ్ – ½ కప్పు * వైట్ బ్రెడ్ – 2 * బటర్ – 1 స్పూన్ * ఉప్పు –

రుచికి తగినంత తయారీ విధానం వెల్లుల్లిని పొట్టు తీసి వాటిని బ్లాంచ్(వేడి నీటిలో వేసి కొంత సేపు ఉంచి.. అనంతరం చల్లని నీటిలో వేయాలి) చేయండి. ఇప్పుడు వైట్ వైన్, ఉప్పు, బటర్ వేయండి. దీనిని 140 సెంటిగ్రేడ్ వద్ద 20 నిముషాలు బేక్ చేయండి. బాదంపప్పులను పొట్టు తీసేసి వేయించండి. వేయించిన వెల్లుల్లి, బాదం పప్పులను ప్యూరీ చేయండి. ఇప్పుడు పాన్ వేడి చేసి.. దానిలో వెన్న వేసి.. వెల్లుల్లి, బాదం ప్యూరీని వేయండి. అనంతరం చికెన్ ఉడకబెట్టిన పులుసు వేసి.. పార్ల్సీ, జాజికాయ పొడి, బేలీఫ్ వేసి సూప్‌ను ఉడకనివ్వండి. ఇప్పుడు దానిలో క్రీమ్‌ను, సాల్ట్ వేసి బాగా కలపండి. దానిలో కోడిగుడ్డు పచ్చసొన వేసి.. అది పగిలిపోకుండా.. ఉడికించండి. ఇప్పుడు క్రౌటన్‌లను తయారు చేయడానికి.. బ్రెడ్ తీసుకోండి. దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి.. రోస్ట్ చేయండి. పచ్చసొన ఉడికిన తర్వాత స్టౌవ్ ఆపేయండి. క్రౌటన్లతో సర్వ్ చేసుకుని.. వేడి వేడిగా లాగించేయండి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !