UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 సినిమా సక్సెస్ అయినందుకు నిఖిల్ అనుపమలతో పాటు చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్

: తెలుగు పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరు అల్లు అరవింద్. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. అయితే అల్లు అరవింద్ సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ సినిమా ‘ 18 పేజెస్ ‘ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో నిఖిల్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. అలాగే ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 23న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.

సినిమా సక్సెస్ అయినందుకు నిఖిల్ అనుపమలతో పాటు చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పారు అభిమానులు. తాజాగా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరుపుకుంది చిత్ర యూనిట్. ఇక పార్టీలో డైరెక్టర్ సుకుమార్, స్టార్ ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ లు కూడా పాల్గొన్నారు. ఈ పార్టీలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ Allu Aravind dance with Anupama parameswaran టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు అనే పాటకు అనుపమతో కలిసి డాన్స్ చేశారు. వీళ్ళతోపాటు డైరెక్టర్ సుకుమార్ కూడా డాన్స్ చేశారు. వీళ్ల ముగ్గురు కలిసి నవ్వుతూ డాన్స్ చేస్తుండగా హీరో నిఖిల్ సెల్ఫీ వీడియో తీశారు. ఈ వీడియోను నిఖిల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. బన్నీ వాసు నిర్మించగా.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించారు

   TOP NEWS  

Share :

Don't Miss this News !