UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 చలపతి రావు ఆకస్మిక మరణం

నవరస నట సౌర్వభౌమ కైకాల సత్యనారాయణ రావు ఆకస్మిక మరణం జీర్ణించుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాద వార్త అందరి మనసులని కొల్లగొట్టింది. ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో అలరించిన చలపతి రావు గుండెపోటుతో ఆయన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సుమారు 1200 కి పైగా సినిమాల్లో, మూడు తరాలకు చెందిన కథా నాయకులతో కలిసి నటించిన చలపతిరావు ఎక్కువగా నెగిటివ్ క్యారక్టర్లతో పరిచయం అయి ఆ తర్వాత వైవిధ్యమైన పాత్రల్లోనూ నటించి వైవిధ్యం చాటారు. తండ్రి, బాబాయి, మామయ్య, విలన్, సైడ్ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పించిన చలపతి రావు ‘గూఢచారి 116’ ఆయన మొదటి సినిమా. 2021లో నాగార్జునతో కలసి నటించిన బంగార్రాజు ఆయన చివరి సినిమా అని చెప్పాలి. చలపతి రావు తన జీవితంలో ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నాడు. 2018 టైంలో హీరో అల్లరి నరేష్‌ హీరోగా ఓ సినిమా చేయగా, ఇందులో ఓ షాట్‌లో చలపతి రావు బస్సు వెనకాల నిచ్చెన ఎక్కుతుండగా జారి కిందపడిపోయారు.

దీంతో ఆయనకు గాయాల పాలు కాగా, చిత్ర బృందం వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించింది. అక్కడ కొన్ని రోజులు చికిత్స తీసుకున్నారు. ఈ ప్రమాదం తర్వాతినుంచి ఆయన ఆరోగ్యంలో మార్పులు రాగా, కొన్నాళ్ల పాటు సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. అలా ఇటీవల సినిమాలలో చాలా తక్కువగా కనిపించిన చలపతి రావు ఇలా కన్నుమూయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. చలపతి రావు గుండెపోటుతో మరణించినట్టు చెబుతుండగా, 2018 టైంలో హీరో అల్లరి నరేష్‌ హీరోగా తెరకెక్కిన సినిమా వలన ఆయన మరణించారని కొందరు చెబుతున్నారు. Chalapathi Rao death news viral Chalapathi Rao : ఏంటి కారణం..? ఈ సినిమా షాట్‌లో చలపతి రావు బస్సు వెనకాల నిచ్చెన ఎక్కుతుండగా జారి కిందపడిపోగా, తీవ్ర గాయాలు కాగా చిత్ర బృందం వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించింది. అక్కడ కొన్ని రోజులు చికిత్స తీసుకుంటుండగా, ఈ కారణం వలనే సినిమా షూటింగ్స్ కి దూరం అయ్యారు. అయితే ఆయన ఇప్పుడు ఆకస్మాత్తుగా మరణించడం ఎవరికి జీర్ణం కావడం లేదు. బంగార్రాజు సినిమాలో చలపాయ్ అంటూ నాగర్జున చేత పిలిపించుకున్నా, బాలకృష్ణ చేత సత్తిరెడ్డీ అంటూ పిలిపించుకున్నా.. ఆది సినిమా యన్టీఆర్ కేర్ టేకర్‌గా నటించినా. సై సినిమాలో నితిన్ తండ్రిగా జీవించినా.. అల్లరి నరేశ్ తో కలసి కామెడీ చేసినా..ప్రతి పాత్రలోను తన ప్రత్యేకత చాటుకున్నారు చలపతి రావు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !