UPDATES  

 బిగ్బాస్ సెట్ కోసం అన్నపూర్ణ స్టూడియో ఇవ్వను అని నాగార్జున చెప్పినట్లు మరో వార్త

తాజాగా నాగార్జున, బాలకృష్ణల మధ్య గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బిగ్బాస్ షో కారణంగా వీరిద్దరి మధ్య గొడవలు మరోసారి బయటపడ్డాయట. వరుసగా బిగ్ బాస్ నాలుగు సీజన్లకి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఏడవ సీజన్ నుంచి తప్పుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. నాగార్జున ప్లేసులో బాలకృష్ణ హోస్టింగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ సీజన్ 6 కి టిఆర్పి రేటింగ్ తక్కువగా రావడంతో హోస్ట్ గా బాలయ్యని తీసుకోవాలని బిగ్ బాస్ టీం ఆలోచన చేస్తుందట. ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ బిగ్బాస్ 7 కి బాలయ్య హోస్ట్ అయితే బిగ్బాస్ సెట్ కోసం అన్నపూర్ణ స్టూడియో ఇవ్వను అని నాగార్జున చెప్పినట్లు మరో వార్త బయటకు వినిపిస్తుంది.

అయితే బాలకృష్ణ కూడా అన్నపూర్ణ స్టూడియోలో సెట్ అంటే రానని బిగ్ బాస్ యాజమాన్యానికి గట్టిగా చెప్పేసాడట. ఈ కండిషన్ కి ఓకే అయితే హోస్ట్ గా చేయడానికి నాకు ఎటువంటి అభిప్రాయం లేదని ఇటీవల తన కలిసిన బిగ్బాస్ టీం తో బాలయ్య చెప్పినట్లు రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ వార్ వారి వారసులు కూడా కొనసాగిస్తున్నారు.. Nagarjuna Balayya war for bigg boss host అని నెటిజన్స్ అంటున్నారు. అప్పట్లో నాగేశ్వరరావు చనిపోయిన తర్వాత జరిగిన సభకి ఇండస్ట్రీ నుంచి అందరూ వచ్చిన బాలయ్య మాత్రం రాలేదని అంటుంటారు. నాగార్జున కనీసం బాలయ్యకి ఆహ్వానం కూడా ఇవ్వలేదని పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. అయితే మళ్లీ ఒక సినిమా ఈవెంట్లో నాగార్జున బాలకృష్ణ ఎదురుపడి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. కానీ ఇద్దరి మొహంలో చిరునవ్వు కనిపించలేదు. ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని నాగ్ చెప్పిన ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !