మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వరుస సినిమాలతో బిజిబిజిగా ఉన్నాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ తో ఈ ఏడాది సందడి చేశాడు. జనవరి 13 వాల్తేరు వీరయ్య(waltair veerayya)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌తో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన రెండు పాటలతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్(waltair veerayya Title Song) సైతం అదరగొట్టాడు
డీఎస్పీ. బగ బగ బగ మండే.. మగ మగ మగ మగాడురా వీడే అంటూ పాట సాగుతోంది. పవర్ ఫుల్ బీజీఎమ్‌తో ఉన్న ఈ పాట ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది. చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి చాలా అద్భుతంగా పాడారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పవర్ ఫుల్ ట్యూన్ ఇచ్చాడు. యాక్షన్ సీక్వెన్స్ లో ఈ పాట వచ్చేలా ఉందని అర్థం అవుతోంది. ఆన్ లైన్ లో మెుదట పాటను విడుదల చేశారు. కాసేపటికి యూట్యూబ్ లోనూ అప్ లోడ్ చేశారు. ముందుగా చిరంజీవి ఫొటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిరు మాస్ లుక్‌లో సూపర్ గా కనిపిస్తున్నాడు.