దళపతి విజయ్(Thalapathy vijay) వారసుడు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో దళపతి విజయ్, రష్మిక మందన్న తదితరులు నటించారు. ప్రమోషన్ వర్క్ భారీగా జరుగుతోంది. తర్వాత లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) తో విజయ్ ‘దళపతి 67′(Thalapathy 67) పనుల్లో బిజీ ఉంటాడు. ఈ చిత్రంలో అర్జున్ సర్జా(Arjun Sarja) విలన్‌గా నటిస్తున్నాడు. సినిమా కోసం ఆయన భారీ పారితోషికాన్ని అందుకున్నట్లు సమాచారం. దళపతి 67వ సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. ఈ చిత్రంలో సంజయ్ దత్(sanjay dutt), గౌతమ్ మీనన్, నివిన్ పౌలీ నటిస్తున్నారు.అర్జున్ సర్జా కూడా ఉన్నాడు. ఈ సినిమా కోసం 4.5 నుంచి 5 కోట్ల పారితోషికం(Remuneration) తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సంజయ్ దత్ రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. దళపతి విజయ్ 100 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. జనవరిలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా షూటింగ్ చెన్నై(Chennai)లో జరగనుంది.
మేజర్ పార్ట్ షూటింగ్ కాశ్మీర్(Kashmir)లో ప్లాన్ చేశారు. ‘దళపతి 67’ బడ్జెట్ 200 కోట్ల రూపాయలను దాటేసిందని అంటున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2023లోనే విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు విజయ్, లోకేష్ కనగరాజ్ సినిమా కావడంతో క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా డిజిటల్ హక్కులకు(digital rights) ఎక్కడ లేని డిమాండ్ వచ్చి పడింది. సౌతిండియాలోనే అత్యధిక మొత్తానికి ఈ సినిమా డిజిటల్ హక్కులు అమ్ముడయ్యాయని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ(OTT) నెట్‌ఫ్లిక్స్ విజయ్, లోకేష్ సినిమా డిజిటల్ హక్కులను ఏకంగా రూ.160 కోట్లకు దక్కించుకోవడం విశేషం. అన్ని భాషల డిజిటల్ హక్కులు ఈ డీల్ కింద నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. వారసుడు(Varasudu)పై విజయ్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దళపతి ఫ్యాన్స్(Thalapathy Fans) కూడా ఎదురుచూస్తున్నారు. విక్రమ్(Vikram) హిట్‌తో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఊపు మీద ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అందుకే ఈ సినిమాపై క్రేజ్ ఉంది. వచ్చే ఏడాది పాన్ ఇండియా(Pan India) లెవల్లో ఈ సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.