UPDATES  

 వైసీపీ నుంచి పేలుతున్న మాటల తూటాలు

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఓ టాక్ షోకి గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ షోని హోస్ట్ చేస్తున్నది మరో సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. దాంతో, సహజంగానే ఈ టాక్ షో విషయమై సినీ వర్గాలతోపాటు, రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. దీన్ని సాధారణ టాక్ షో అని అనుకోవడంలేదు ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ – జనసేన మధ్య పొత్తుకు నిఖార్సయిన వేదికగా దీన్ని వైసీపీ పరిగణిస్తోంది.

వైసీపీ నుంచి పేలుతున్న మాటల తూటాలు.. వైసీపీ నుంచి మంత్రి అంబటి రాంబాబు సహా పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా అన్ స్టాపబుల్ టాక్ షో మీద విమర్శలు చేస్తున్నారు. దానికి అటు జనసేన నుంచీ.. ఇటు టీడీపీ నుంచి కూడా కౌంటర్ ఎటాక్ అంతే స్థాయిలో వుంది. వాస్తవానికి రెండో సీజన్ స్టార్ట్ అయ్యాక.. రాజకీయ అంశాలు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో ఈ టాక్ షో కొత్త సీజన్‌ని నందమూరి బాలకృష్ణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఈ టాక్ షోలో సందడి చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !