UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 జాజికాయ ఆరోగ్య ప్రయోజనాలు

జాజికాయను సాధారణంగా మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. మాంసాహార వంటకాలలో జాజికాయ ఉపయోగించడం ద్వారా, ఆ వంటకం మంచి సువాసనతో పాటు, రుచిని పొందుతుంది.

కేవలం రుచి, వాసనలే కాదు, జాజికాయతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జాజికాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మన శరీరానికి తగినన్ని పోషకాలను అందిస్తుంది. జాజికాయలో ఫైబర్, థయమిన్, విటమిన్ బి6, కాల్షియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఆయుర్వేద వైద్యంలో జాజికాయను అనేక వ్యాధుల చికిత్సలలో ఉపయోగిస్తారు. జాజికాయ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, పాంక్రియాటిక్ పనితీరును ఉత్తేజ పరుస్తుందని నివేదికలు తెలిపాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

జాజికాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో, క్యాన్సర్, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి వంటి తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. జాజికాయ నూనెను అనేక దంత ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు.

అధిక కొలెస్ట్రాల్ నియంత్రణ

జాజికాయలో అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించే సామర్థ్యం ఉందని వివిధ అధ్యయనాలు రుజువు చేశాయి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు రెండూ శరీరానికి అవసరమయ్యే కొవ్వులు. అయితే శరీరంలో ఈ కొవ్వులు పెరిగితే మాత్రం అవి రక్తనాళాల్లో పేరుకుపోతాయి. ఫలితంగా గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వంటల్లో జాజికాయను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

సంతానోత్పత్తి సామర్థ్యం కొరకు

బలహీనమైన లైంగిక శక్తి, వంధ్యత్వ సమస్యలతో బాధపడుతున్న పురుషులకు జాజికాయ చాలా మంచిది. ఇది లైంగిక ప్రేరేపణను మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాల ద్వారా నిరూపితమైంది. జాజికాయలోని మూలకాలు లైంగిక శక్తిని పెంచడమే కాకుండా స్పెర్మ్ కణాల అభివృద్ధికి కూడా సహాయపడతాయి. పురుషులలో నపుంసకత్వము, స్కలనంలో ఇబ్బందులు మొదలైన లైంగిక సమస్యలను ఇది దూరం చేస్తుంది.

మనస్సుకు రిఫ్రెష్‌మెంట్

జాజికాయ మన మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. కొంతమందికి చలికాలంలో నీరసంగా అనిపిస్తుంది. దీన్నే సీజనల్ డిజార్డర్ అంటారు. జాజికాయ తీసుకోవడం వల్ల నీరసం పోయి, మనసుకు ఉల్లాసం కలుగుతుంది. ఇది యాంటీ డిప్రెసెంట్‌గా పని చేయడంతోపాటు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. జాజికాయలో ఉండే ‘మిరిస్టిసిన్’ అనే పదార్థం మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. జాజికాయ అల్జీమర్స్ వంటి వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !