UPDATES  

 పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా రీ రిలీజ్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను షాక్‌

పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా రీ రిలీజ్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేస్తోన్నాయి. స్ట్రెయిట్ సినిమాకు ధీటుగా బుకింగ్స్ జరగడం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 31న రీ రిలీజ్ కానుంది. బుధవారం నుంచి ఈ సినిమా బుకింగ్స్ మొదలయ్యాయి. కొద్ది గంటల్లోనే హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ కోటి రూపాయలను దాటినట్లు సమాచారం. రీ రిలీజ్ సినిమాల్లో హయ్యెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌ను సొంతం చేసుకున్న సినిమాగా ఖుషి కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మూడు రోజుల ముందుగానే ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడుపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ జోరు చూస్తే రీ రిలీజ్ సినిమాల్లో కలెక్షన్స్ పరంగా ఖుషి సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని చెబుతున్నారు.

ఒక్క హైదరాబాద్‌లోనే ఈ సినిమా వందకుపైగా థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 31న ప్రసాద్ ఐమాక్స్‌లోనే పదికిపైగా షోలను వేస్తోన్నారు. . ఓవరాల్‌గా తెలంగాణ, ఆంధ్రాలో దాదాపు మూడు వందల థియేటర్లలో ఈసినిమా రీ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. 4కే డాల్బీ అట్మాస్ టెక్నాలజీలో ఖుషి సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్‌, ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పోస్టర్స్‌ను తెగ షేర్ చేస్తున్నారు. ఖుషి సినిమాకు ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌, భూమిక కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకున్నది. పవన్ కళ్యాణ్‌కు యూత్‌లో ఫాలోయింగ్‌ను పెంచిన సినిమాల్లో ఖుషి ఒకటి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !