UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్పమార్పు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది సీబీఎస్ఈ బోర్డు. సీబీఎస్ఈ బోర్డు పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి మార్చ్ 21 వరకూ కొనసాగనున్నాయి. ఇక 12వ తరగతి పరీక్షలు ఫిభ్రవరి 15 వ తేదీన ప్రారంభమై..ఏప్రిల్ 5 వరకూ జరుగుతాయి. ప్రతిరోజూ ఉదయం 10.30 నిమిషాల్నించి 1.30 నిమిషాలవరకూ పరీక్షలు జరగనున్నాయి. రెండు సబ్జెక్టుల మధ్య గ్యాప్ ఇవ్వడమే కాకుండా జేఈఈ మెయిన్స్ పరీక్షల్ని దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ షెడ్యూల్ రూపొందించింది. ఈ క్రమంలోనే 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో చిన్న మార్పు చేసింది.

ఏప్రిల్ 4న జరగాల్సి న పరీక్షను మార్చ్ 27నే నిర్వహించనుంది. మిగిలిన టైమ్ టేబుల్ యధాతధంగా ఉంటుంది. ఏ రెండు సబ్జెక్టుల కూడా ఒకే రోజు రాకుండా ఉండేందుకే ఈ మార్పు చేసినట్టు సీబీఎస్ఈ బోర్డు తెలిపింది. సీబీఎస్ఈ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inలో ఉన్నాయి. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 15 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 4 వరకూ జరగనున్నాయి. పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 18 వరకూ జరగనున్నాయి. ఇక తెలంగాణలో సైతం పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 18 వరకూ జరుగుతాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా తెలంగాణలో మార్చ్ 15 నుంచే ప్రారంభమై..ఏప్రిల్ 4 వరకూ జరగనున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !