సరిగ్గా 2023 నూతన సంవత్సరాది ముందు నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది…. తెలంగాణ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఈరోజు కొద్దిసేపటి క్రితమే విడుదల అయింది. 783 గ్రూప్ 2 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేయగా జనవరి 18 నుంచి గ్రూప్ 2 దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఒకరకంగా రాష్ట్రంలో TSPSC నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతున్నట్టు అయింది. ఇప్పటికే గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించిన 503 పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది TSPSC. ఇక ఇప్పుడు తాజాగా ఈరోజు గ్రూప్-2 నుంచి 783 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇక మరోపక్క రేపటి నుంచి రాష్ట్రంలో 9,168 గ్రూప్ 4 నోటిఫికేషన్ లకు దరఖాస్తు స్వీకరించనున్నారు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 581 వార్డెన్ పోస్టుల నియామక నోటిఫికేషన్ విడుదలవగా, వెటర్నరీ సర్జన్ గా కూడా 185 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లో 22 ఆఫీసర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల అయింది. అదేవిధంగా రాష్ట్రంలో జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1392 జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఇక మరోపక్క జూనియర్ కాలేజీలు మరి పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ల నియామకానికి 148 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది.