UPDATES  

 అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ అరెస్ట్‌

హిందూ దేవుళ్లపై ముఖ్యంగా అయ్యప్ప స్వామి జననం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై కేసు నమోదు అయింది. హిందూ సంఘాలు మరియు బిజెపి నాయకులు నరేష్ పై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వామి మాలా దారులు నిరసనలు రాస్తారోకోలు చేపట్టిన నేపథ్యంలో నరేష్ ని అరెస్టు చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల బైరి నరేష్ పై హిందూ సంఘాల వారు మరియు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వారు భౌతిక దాడికి దిగిన విషయం తెలిసిందే. దాడి నుండి తప్పించుకున్న నరేష్ అజ్ఞాతంలోకి వెళ్ళాడు.

పలు స్టేషన్ లలో వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదు అయిన కారణంగా ఆయనను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. నరేష్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా నరేష్ వ్యాఖ్యలు ఉన్న కారణంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హిందూ సంఘాల వారు మరియు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వారు బైరి నరేష్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్‌ పేరు చెప్పి హిందూ దేవుళ్లను అవమానించిన బైరి నరేష్‌ తీరుకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !