కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా చెప్పుకోవచ్చు. కొన్నాళ్ళ క్రితం వరకూ ఆయనకు ఓ విదేశీ స్నేహితురాలు వుండేది. ఆమెతో రాహుల్ గాంధీ వివాహం జరుగుతుందంటూ ప్రచారం తెరపైకొచ్చింది. కానీ, రాహుల్ ఇప్పటికీ బ్రహ్మచారిగానే వుండిపోయారు. రాహుల్ పెళ్ళెప్పుడు.? అని తరచూ చర్చ జరుగుతుంటుంది. సల్మాన్ ఖాన్ తరహాలోనే రాహుల్ కూడా పెళ్ళి చేసుకునే ఆలోచన వున్నట్లు కనిపించరు. భార్య ఎలా వుండాలంటే..
తాజాగా తన భార్య ఎలా వుండాలన్నదానిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో పెళ్ళి మీదకు రాహుల్ గాంధీ మనసు మళ్ళిందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘మా అమ్మ, నానమ్మలోని లక్షణాలు నా భార్యలో వుండాలి..’ అంటూ రాహుల్ గాంధీ, తనకు భార్యగా కా బోయే మహిళలో వుండాల్సిన లక్షణాల గురించి తాజాగా చెప్పుకొచ్చారు. ‘నేను పెళ్ళికి సిద్ధం..’ అని రాహుల్ చెప్పాలేగానీ, ఆయన వయసు గురించి ఎవరికీ సమస్య వుండదు.. లక్షల్లో ఆయన కోరుకున్న లక్షణాలున్న వాళ్ళు దొరుకుతారు. ఇంతకీ, రాహుల్ గాంధీకి పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం వుందా.? లేదా.?