ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ను మొదలుపెట్టిన దిల్ రాజ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో దిల్ రాజ్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇద్దరు స్టార్ హీరోలకు దిల్ రాజ్ గట్టి కాంపిటీషన్ ఇవ్వబోతున్నాడు. ఈ సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఎప్పుడు లేని విధంగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పక్కపక్క రోజున రిలీజ్ కావడంతో దీనిపై ప్రాధాన్యత పెరిగింది.
అయితే దిల్ రాజ్ చిరంజీవి, బాలకృష్ణ లకు పోటీగా వారసుడు సినిమాని రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. దీని గురించి గత కొన్ని నెలలుగా బాక్స్ ఆఫీస్ వద్ద వార్ జరుగుతుంది. అయితే ఇటీవల దిల్ రాజ్ తెగించి గట్టి నిర్ణయం తీసుకున్నాడు. వారసుడు సినిమాను ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. Dil Raj strong decision to Chiranjeevi వైజాగ్ లో మేజర్ థియేటర్స్ వారసుడు సినిమాకి దక్కాయి. ఇవి మేజర్ రెవెన్యూ ఇచ్చే థియేటర్స్ గా ఉన్నాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు జగదాంబ థియేటర్ దక్కింది. దిల్ రాజు తగ్గకపోతే బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ పరంగా ఎక్కువ వసూలు చేయలేవు. దీంతో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఏది ఏమైనా ఈ సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అన్నమాట.