UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 Ayy…Minister Malla Reddy మళ్లీ ఏసేశాడు..

‘మల్లన్నా… ఏందే గంతమాటన్నవ్‌.. జర ఎనుకముందు చూసి మాట్లాడే.. పుసుక్కన మాట ఇడ్సిపెడ్తివి.. రేపు ఎటమటం ఐతే ఎట్లనే’ మల్లన్న ఎవలూ.. ఏమన్నడు.. ఎటమటం అయ్యేది ఏంటి? అనుకుంటున్నారా.. అదే అండీ మన మల్లారెడ్డి.. మంత్రి మల్లారెడ్డి.. పంచులు వేయడంలో ఆయనకు ఆయనే సాటి కదా.. తాజాగా మళ్లీ ఓ పంచ్‌ వేసేశాడు. అది మామూలు పంచ్‌ కాదూ.. ఇన్నళ్లూ ఆయన పంచులకు తెలంగాణ ప్రజలే నవ్వుకున్నారు. ఇప్పుడు ఆంధ్రావాళ్లూ నవ్వుకుంటున్నారు. అట్లుంటయ్‌ మరి మన మల్లన్న పంచులు. Minister Malla Reddy ఆంధ్రాలో అధికారంలోకి వస్తారట.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి మల్లారెడ్డి సోమవారం తిరుమల వెళ్లారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో 175 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని ప్రకటించాడు.

అంతటితో ఆగలేదు ఆంధ్రాలో అధికారంలోకి వస్తామన్నారు. దీంతో మీడియా వాళ్లు నవ్వు ఆపుకోలేకపోయారు. v ఏంది మల్లన్నా జోకులు… బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీని ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించడంపై దృష్టి సారించారు. జనసేన మాజీ నేత తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, మాజీ ఐపీఎస్‌ అధికకారి సోమవారం బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని తెలిసింది. చంద్రశేఖర్‌ బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు.. ఇంకా బీఆర్‌ఎస్‌ ఆంధ్రల్లో విస్తరించనే లేదు. కానీ తిరుమలలో ఉన్న బీఆర్‌ఎస్‌ మంత్రి మల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయి. ”బీఆర్‌ఎస్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. 2024లో ఆంధ్రాలో కచ్చితంగా అధికారంలోకి వస్తాం.. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయబోతున్నాం” అని ప్రకటించారు. దీంతో మీడియా ప్రతినిధులే కిసుక్కుమన్నారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !