UPDATES  

 వృద్దులకు దొంగనోట్లు పంచిన వాలంటీర్లు

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల 1వ తారీఖున వృద్ధాప్య మరియు వితంతు, వికలాంగ పింఛన్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. గ్రామ మరియు వార్డు సచివాలయ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి నగదును లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. అయితే ఈనెల పంపిణీ చేసిన నగదులో దొంగనోట్లు ఉండటం సంచలనం సృష్టించింది. ప్రకాశం జిల్లా ఎర్ర గొండపాలెం మండలం నర్సాయపాలెం ఎస్సీ పాలెంలో వాలంటీర్ పంచిన డబ్బులో దొంగ నోట్లు ఉన్నాయని తేలడం అందరికి షాకింగ్‌ గా మారింది.

ఆ దొంగ నోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, వాలంటీర్ కావాలని పెట్టాడా లేదంటే బ్యాంకు నుండి వచ్చిందా అంటూ ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఆ వ్యక్తికి వాలంటీర్ డబ్బులు ఇవ్వడంతో, ఆ డబ్బులను తన సమీప బంధువుకి ట్రాన్స్ఫర్ చేయించే ఉద్దేశమై షాప్ కు వెళ్లిన వ్యక్తి కి షాక్ తగిలినంత పనైంది. ఆ డబ్బు దొంగ నోట్లని తేలడంతో అంతా షాక్ అయ్యారు. మొత్తం 19 వేల రూపాయల దొంగ నోట్లు ఉన్నాయని వెళ్లడైంది. ప్రస్తుతం ఈ విషయమై ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !