తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. జాతీయ పార్టీ హోదా దక్కేందుకు సాధించాల్సిన సీట్లు ఓట్లు రాబట్టేందుకు మెల్ల మెల్లగా కేసీఆర్ అడుగులు వేస్తున్నాడు. పక్క రాష్ట్రం ఏపీలో సభలు, సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు అంటూ ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక నేటి సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఏపీకి చెందిన పలువురు నాయకులు మరియు మాజీ ఐఏఎస్ అధికారులు బీఆర్ఎస్ లో చేరబోతున్నారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న ఏపీ నాయకులు మరియు ఐఏఎస్ అధికారులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఆంధ్రులను బూతులు తిట్టిన కేసీఆర్ పార్టీలో చేరడం దారుణం అన్నాడు. కేసీఆర్ పార్టీలో కుక్కలు నక్కలు నీచుల మాదిరిగా ఏపీ నాయకులు చేరుతున్నారని పాల్ దుయ్యబట్టాడు. డబ్బుకు ఆశపడి కొందరు ఆంధ్రులు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రావెల కిషోర్ బాబు మరియు తోట చంద్రశేఖర్ లపై పాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏపీ నాయకులను రాష్ట్రం నుండి వెలి వేయాలంటూ పాల్ పిలుపునిచ్చారు.