తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు నేతలు భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో వారికి గులాబీ కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. వీరిలో మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, రిటైర్డ్ ఐ
ఆర్ఎస్ అధికారి పార్ధసారధి ఉన్నారు. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలను కలుస్తున్నారు. ఈక్రమంలో ఏపీపై దృష్టి సారించడంతో పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. టీడీపీ హయాంలో మంత్రిగా చేసిన రావెల కిశోర్ బాబు అనంతర కాలంలో జనసేన, బీజేపీలో చేరారు. తోట చంద్రశేఖర్ 2009లో ప్రజారాజ్యం, అనంతరం వైసీపీ, జనసేన పార్టీల్లో చేరారు. చింతల పార్ధసారధి ఐఆర్ఎస్ పదవికి రాజీనామా చేసి 2019లో జనసేనలో చేరి ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరారు.