టీ, కాఫీలు ఇచ్చే శక్తి, రిలీఫ్‌ను, ఆ అనుభూతిని అందరూ ఇష్టపడతారు. అయితే ఈ పానీయాలు తాగినప్పుడు ఎంత మంచిగా ఉన్నా.. వాటి వల్ల అంతే ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి. కెఫీన్ ఎక్కువగా తీసుకుంటే దీర్ఘకాలికంగా పెరిగిన ఒత్తిడి స్థాయిలకు దారితీస్తుంది. అంతేకాకుండా నిద్ర, రికవరీకి అంతరాయం కలిగిస్తుంది. అందుకే వీటికి దూరంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. ఏదైనా లిమిట్‌గా తీసుకుంటే మంచిది కానీ.. కొందరు అదే పనిగా వాటిని తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల మీకు తెలియకుండానే.. శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మీ టీ, కాఫీ కోరికలను అరికట్టే చిట్కాలు ఇక్కడున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తగినంత నిద్ర, హైడ్రేటెడ్‌గా ఉండండి మీరు రోజంతా తగినంత శక్తిని కలిగి ఉండేలా చూసుకోవడానికి తగినంత నిద్ర పొందడం చాలా ముఖ్యమైన విషయం.
ఇది శరీరం శక్తిని, అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ (ATP)ని తయారు చేసే మీ శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. మీరు రోజంతా ఉత్సాహంగా ఉన్నప్పుడు.. మీరు కెఫిన్, నికోటిన్ కోసం తక్కువ కోరికలను కలిగి ఉంటారు. అలాగే తగినంత నీరు తాగడం వల్ల కాఫీ, టీ కోసం మీ కోరికలను కంట్రోల్ చేస్తుంది. మీరు తగినంత ఎలక్ట్రోలైట్లను పొందుతున్నారని అర్థం. ఉదయం సూర్యకాంతి మీరు సూర్యోదయానికి రెండు గంటలలోపు త్వరగా మేల్కొనేలా చూసుకోండి. నిద్రలేచిన అరగంట లోపు మీరు కనీసం 10 నిమిషాల సూర్యరశ్మిని పొందండి. ఉదయం చల్లటి షవర్ లేదా ఐస్ బాత్ రూపంలో కొద్దిగా చల్లగా ఉండటం వల్ల అడ్రినలిన్, డోపమైన్‌లలో దీర్ఘకాల ఎలివేషన్స్ ఏర్పడతాయి. తద్వారా మీ మానసిక స్థితి, శక్తి, దృష్టి గణనీయంగా పెరుగుతుంది. గ్రీన్ టీ వంటి వాటికి మారండి కాఫీ, బ్లాక్ టీని మానివేయడానికి గ్రీన్ టీ ఒక గొప్ప ప్రత్యామ్నాయం. ఇది కొంత కెఫిన్ కలిగి ఉంటుంది కానీ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది L-theanine, కొన్ని ఇతర సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇవి శాంతించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. మీరు నిజంగా టీ లేదా కాఫీ తాగడాన్ని ఆనందించండి. అయితే మీరు కెఫిన్ తీసుకోవడం తగ్గించాలనుకుంటే.. హెర్బల్ టీలు లేదా డీకాఫిన్ చేసిన వెర్షన్‌లకు మారడానికి ప్రయత్నించండి.