UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి..m పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 షాహీ కోడిగుడ్డు కూర.. లో ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని పోషకాలు

గుడ్లలో ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని పోషకాలు ఉంటాయి. చాలా రకాల విటమిన్లతో పాటు, మినరల్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యంగా ఉంచడానికి గుడ్లు సరైన ఆహారం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన మెదడు పనితీరుకు, మెరుగైన కంటి చూపుకు గుడ్లు తినాలని న్యూట్రిషనిస్టులు సిఫారసు చేస్తారు. మీరు రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం చేయాలనుకుంటే మీ ఆహారంలో గుడ్లను చేర్చుకోండి. కోడిగుడ్డుతో కొంచెం మసాలా కలిపి, స్పైసీగా షాహీ ఎగ్ కర్రీ రెసిపీ ఇక్కడ అందిస్తున్నాం. అందంగా ఉడకబెట్టిన గుడ్లు, కొత్తిమీర సువానలు, కసూరి మెంతి కమ్మదనాన్ని కలిపి సుగంధ ద్రవ్యాల మేలవింపుతో తయారు చేసే ఈ వంటకం మీ కడుపు నింపడమే కాదు, మీ మనసును సంతృప్త పరుస్తుంది. మరి షాహీ ఎగ్ కర్రీ చేసేందుకు ఏమేం కావాలి, ఎలా తయారో చేయాలో ఇక్కడ రెసిపీ ఉంది, ఇక్కడ అందించిన సూచనలతో మీరు సులభంగా ఈ వంటకం తయారు చేసుకోవచ్చు.

కోసం కావలసినవి 4 గుడ్లు 1 tsp వెల్లుల్లి 1 ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి 1 tsp అల్లం 1 టేబుల్ స్పూన్ తాజా క్రీమ్ 1 టేబుల్ స్పూన్ పెరుగు 1 టీస్పూన్ కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా 1/2 స్పూన్ గరం మసాలా 1/2 స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ నూనె కొంచెం కొత్తిమీర రుచికోసం ఉప్పు స్పైసీ కోడిగుడ్డు కూర- షాహీ శైలిలో తయారీ విధానం ముందుగా ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలను గ్రైండ్ చేసి ముతక పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత బాణలిలో నూనె వేడి చేసి, అందులో ఇదివరకు రుబ్బుకున్న ముద్దను వేయించాలి. ఇప్పుడు కసూరి మేతి, గరం మసాలా, కారం, ఉప్పు వేయండి. ఆపై 1 కప్పు నీరు పోసి 10 నిమిషాలు మరిగించాలి. ఇ ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లను రెండు ముక్కలుగా చేసి పాన్‌లో వేయండి. ఇది 5-6 నిమిషాలు ఉడికించాలి. ఆపై చాట్ మసాలా వేసి బాగా కలపాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసి పెరుగు, క్రీమ్‌ను బాగా కలిపిన మిశ్రమాన్ని ఒక టీస్పూన్ వేయాలి. కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకోవాలి. అంతే స్పైసీ షాహీ ఎగ్ కర్రీ రెడీ. మీరు ఈ కూరను చపాతీ, పరాఠా, అన్నం, బిర్యానీ లేదా పులావ్‌ దేనితో అయినా తినవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !