UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 టేస్టీగా మొక్కజొన్న పులావ్

మొక్కజొన్నలు దొరికే సమయంలో మీరు అదిరే వంటకాలు చేసుకోవచ్చు. వడలు, గారెలు, సూప్, స్వీట్స్​తో పాటు అదిరే, టేస్టీ పులావ్ తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్న గింజలతో, మసాలదినుసులతో తయారు చేసుకునే ఈ పులావ్​ను పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టపడతారు. ఇంతకీ ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు

ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు * బాస్మతి బియ్యం – 250 గ్రాములు * కార్న్ – 80 గ్రాములు * ఆలివ్ ఆయిల్ – 2 టీస్పూన్లు * ఉల్లిపాయ – 1 * అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్ * ఉప్పు – తగినంత * పచ్చిమిర్చి – 4 * జీలక్రర – 1 టీస్పూన్ * బే ఆకు – 2 * పెప్పర్ – 1/2 టీస్పూన్ * లవంగాలు – 8 * వేడి నీళ్లు – 2 కప్పులు * కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్ల్ * నిమ్మరసం – 1 టీస్పూన్ * బెల్ పెప్పర్ – 1 * కొబ్బరి తురుము – 1 టీస్పూన్ తయారీ విధానం మొక్కజొన్న పులావ్ తయారు చేయడం కోసం.. బాస్మతి బియ్యాన్ని కడిగి నీటిలో కనీసం 15-20నిమిషాలు నానబెట్టండి. కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆకులను మెత్తగా రుబ్బి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు పాన్ తీసుకుని దానిలో ఆలివ్ ఆయిల్ వేయండి. నూనె వేడి అయిన తర్వాత జీలకర్ర, లవంగాలు, బే ఆకు, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలపండి. అవి బాగా వేగిన తర్వాత.. ఆపై మొక్కజొన్న గింజలను వేయండి. దానిలో బియ్యం వేసి.. వేడినీరు, కొద్దిగా ఉప్పు వేసి 15 నిమిషాలు ఉడికించండి. బియ్యం 3/4వ వంతు ఉడికిన తర్వాత నిమ్మరసం వేసి బాగా కలపండి. చివరిగా బెల్ పెప్పర్, కొబ్బరి తురుము, కొత్తిమీర ఆకులతో గార్నీష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే మొక్కజొన్న పులావ్ రెడీ. దీనిని మీకు నచ్చిన కర్రీతో, రైతాతో సర్వ్ చేసుకోవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !