మెగాస్టార్ చిరంజీవి ఈసారి సంక్రాంతి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. వాల్తేర్ వీరయ్య మూవీతో చిరు సందడి చేయనున్నాడు. గాడ్‌ఫాదర్ సక్సెస్‌తో ఊపు మీదున్న మెగాస్టార్.. సంక్రాంతికి కూడా హిట్ కొడతానన్న విశ్వాసంతో ఉన్నాడు. జై లవ కుశ, పవర్, వెంకీ మామలాంటి సినిమాలు తీసిన బాబీ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు ఇప్పటికే ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వాల్తేర్ వీరయ్య టైటిల్ సాంగ్‌కు మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక జనవరి 13న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఈ మధ్యే సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. దీనికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక వాల్తేర్ వీరయ్య మూవీ నిడివి కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 40 నిమిషాలుగా తేల్చారు. కోన వెంకట్ అందించిన స్క్రీన్ ప్లే అంతసేపు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలకపాత్ర పోషించాడు
. శృతి హాసన్ ఫిమేల్ లీడ్‌గా కనిపించనుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసింది. సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో వాల్తేర్ వీరయ్య రన్‌టైమ్ కూడా ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇప్పటికే దళపతి విజయ్ వారసుడు మూవీ రన్‌టైమ్ 2 గంటల 50 నిమిషాలుగా తేల్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ తర్వాత ఎక్కువ రన్‌టైమ్ ఉన్న సినిమా ఇదే. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. జనవరి 13న ఈ సినిమాను హిందీలో విడుదలచేయబోతున్నట్లు వెల్లడించారు. బాలీవుడ్‌లోనూ ఈ సినిమాను వాల్తేర్ వీరయ్య టైటిల్‌తోనే రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కొత్త ఏడాదిని పురస్కరించుకొని ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ చిరంజీవి స్పెషల్ పార్టీ ఇచ్చారు. పార్టీలో వాల్తేర్ వీరయ్య టీమ్‌తో కలిసి దిగిన ఫొటోను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పార్టీకి రవితేజతో పాటు దర్శకుడు బాబీ, రైటర్ కోన వెంకట్, ప్రొడ్యూసర్ రవిశంకర్, ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్, శేఖర్ మాస్టర్‌తో పాటు వెన్నెలకిషోర్, శ్రీనివాసరెడ్డితో పాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.