బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డిలో రైతులు ఉద్యమిస్తున్న దరిమిలా వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్ళిన ఎంపీ బండి సంజయ్ ని పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
బీజేపీ కార్యకర్తలు, రైతులు ఈ అరెస్టుని తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్‌ని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తం.. బండి సంజయ్ అరెస్టుతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసు వాహనం స్వల్పంగా ధ్వంసమయ్యింది. కలెక్టరేట్ దారిలో పెద్దయెత్తున పోలీసులు మోహరించారు. ఇంకోపక్క రైతులకు సంఘీభావంగా పెద్దయెత్తున బీజేపీ కార్యకర్తలూ అక్కడికి చేరుకుంటున్నారు.