UPDATES  

 ఎట్టకేలకు బయటకొచ్చిన సమంత.

సమంత కోలుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు మూడు నెలల తర్వాత ఆమె బయటకు వచ్చారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో సమంత కనిపించారు. దీంతో అక్కడి మీడియా ఆమెను కవర్ చేశారు. టాప్ టు బాటన్ ట్రెండీగా తయారైన సమంత చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఆమె గాగుల్స్ పెట్టుకోవడంతో ముఖంలోని ఫీలింగ్స్ తెలియలేదు. మాయోసైటిస్ బారిన పడ్డ సమంతలో కొన్ని మార్పులు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఆమె ముఖం ఆయిలీగా ఉంది. అది మేకప్ నా లేక సమస్య కారణంగా అలా కనిపిస్తుందా అనేది తెలియదు. అలాగే ఆమె మరింత సన్నబడ్డారు. Samantha సాధారణంగానే సమంత స్లిమ్ అండ్ ఫిట్ గా ఉంటారు. ట్రీట్మెంట్, ఒత్తిడి కారణంగా ఆమె బరువు తగ్గినట్లు తెలుస్తోంది. సమంత కళ్ళజోడు పెట్టుకోవడానికి ఏదో కారణం ఉందన్న అనుమానం కలిగింది. కెమెరా మెన్లు ఆమెను వెంటాడుతుంటే కొంచెం అసహనం ఫీలైన భావన ఆమెలో కనిపించింది.

వారు న్యూ ఇయర్ విషెస్ చెబుతున్నా కానీ, సమంత స్పందించలేదు. సమంత కోలుకున్న సూచనలు కనిపిస్తున్నప్పటికీ… బిహేవియర్ చాలా కొత్తగా ఉంది. కాగా సమంత మాయోసైటిస్ నుండి కోలుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆమె త్వరలోనే షూటింగ్ సెట్స్ లో జాయిన్ అవుతారని చెప్పారు. చెప్పినట్లే సమంత ఒక్కొక్క వర్క్ ఫినిష్ చేస్తున్నారు. శాకుంతలం మూవీ జనవరి 17న విడుదల కానుంది. ఆ చిత్ర డబ్బింగ్ ఇంటి వద్ద నుండి కంప్లీట్ చేశారు. గతంలో సమంతకు సింగర్ చిన్మయి డబ్బింగ్ చెప్పేవారు. ప్రస్తుతం సమంత స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. Samantha ఇక ఫ్యామిలీ మాన్ 2 డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే లతో సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కి సైన్ చేశారు. హాలీవుడ్ సిరీస్ రీమేక్ గా ఇది తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ షూట్ సైతం ప్రారంభం కావాల్సి ఉంది. దాని కోసమే సమంత ముంబై వచ్చి ఉంటారు. సిటాడెల్ మేకర్స్ ని కలిసే విషయమై ఆమె ముంబైలో అడుగుపెట్టి ఉండవచ్చు. కరణ్ జోహార్ తో పాటు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు సమంతతో చిత్రాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వినికిడి. కాగా సమంత తెలుగులో చేస్తున్న మరొక ప్రాజెక్టు ఖుషి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !