మొన్నటి వరకూ మౌనంగా ఉన్న రమ్య రఘుపతి అగ్నిపర్వంలా పేలింది. నరేష్ జీవితం ఇది అంటూ కీలక ఆరోపణలు చేశారు. చాలా కాలంగా నరేష్, రమ్య రఘుపతి మధ్య వివాదం నడుస్తోంది. అయితే వీరి మనస్పర్థలు పవిత్ర లోకేష్ ఎంట్రీతో హైలైట్ అయ్యాయి. రమ్య రఘుపతికి నరేష్ విడాకులు ఇవ్వలేదు. వీరికి రణ్ వీర్ అనే కొడుకు ఉన్నాడు. అతడు తల్లి వద్దే పెరుగుతున్నాడు. గతంలో రమ్య రఘుపతి కృష్ణ ఫ్యామిలీ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. నరేష్ భార్యగా మీడియాలో ప్రొజెక్ట్ కావడంతో నరేష్ వివరణ ఇచ్చాడు. ఆమెతో విడిపోయి చాలా కాలం అవుతుంది. రమ్యతో నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదంటూ తెలియజేశారు. Ramya Raghupathi- Naresh నరేష్-పవిత్ర లోకేష్ ఎఫైర్ బయటకొచ్చాక రమ్య రఘుపతి సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. వారి బంధాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. నరేష్-పవిత్ర లోకేష్ మైసూర్ లోని ఒక హోటల్ గదిలో ఉన్నారని తెలిసి… ఆమె గది ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మెల్లగా సద్దుమణిగిన రమ్య-నరేష్ వివాదాలు పెళ్లి ప్రకటనతో మళ్ళీ రగిలాయి.
పవిత్ర లోకేష్ తో నరేష్ పెళ్లి ప్రకటన చేసి వారం రోజులు అవుతున్నా రమ్య రఘుపతి సైలెంట్ గా ఎందుకు ఉన్నారని జనాలు అనుకుంటుండగా బాంబు పేల్చింది. ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్య రఘుపతి సీరియస్ అలిగేషన్స్ చేశారు. ఆమె మాటల ప్రకారం సూపర్ స్టార్ కృష్ణ గౌరవానికి కూడా నరేష్ భంగం కలిగించాడు. ఆ వయసులో కృష్ణగారితో నాకు ఎఫైర్ నరేష్ అంటగట్టాడని రమ్య చెప్పడం సంచలనం రేపుతోంది. నన్ను వదిలించుకోవడానికి నరేష్ దారుణాలు చేశాడు. కృష్ణ గారికి నా వలన ప్రాణహాని ఉందని ఒక కంప్లైంట్ తయారు చేశాడు. ఆ కంప్లైంట్ కృష్ణ రాసినట్లు ఆయన సంతకం నరేష్ ఫోర్జరీ చేశాడు. దాని ఆధారంగా నాపై కేసు పెట్టాడు. Ramya Raghupathi- Naresh వీటన్నింటికీ సంబంధించి నా వద్ద ఆధారాలు ఉన్నాయి. కృష్ణగారి ప్రతిష్టకు భంగం కలగకూడదని నేనెప్పుడూ ఈ విషయాలు బయటపెట్టలేదు. పవిత్రను నాకు నరేష్ పరిచయం చేశాడు. నా చేతులతో ఆమెకు స్వయంగా భోజనం వడ్డించాను. నేను అన్నం పెడితే ఆమె నాకు సున్నం పెట్టింది… అంటూ రమ్య రఘుపతి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేష్ ని నేను వదిలేది లేదు. నా కొడుకు నాన్న కావాలి అంటున్నాడని షాకింగ్ కామెంట్స్ చేశారు.