సామాన్యుల చెంతకు సత్వర న్యాయం
ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి
జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి
మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 07.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి గ్రామంలోని రైతువేదికలో న్యాయ అవగాహన కార్యక్రమం ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగ పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.బానుమతి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల గ్రామాలలో ప్రజలకు చట్టాల పట్ల కనీస అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం నుంచి వారికి అందుతున్నటువంటి కనీసం మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటూ.. గ్రామాలలో భూమికి సంబంధించిన న్యాయపరమైన ఇబ్బందులు ఎదురైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు ను చేసుకోవడం ద్వారా సమస్యకు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. రాజ్యాంగం ప్రకారం న్యాయం పొందడం ప్రతి పౌరుని కనీస హక్కు అని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం తల్లిదండ్రులను చూసుకోవాల్సిన కనీస బాధ్యత వారి కుమారులపై ఉంటుందని కనీస పోషణ వారి బాధ్యత అని తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం నేరమని అత్యధికంగ జరుగుతున్న ప్రమాదాలు వారి యొక్క నిర్లక్ష్యం వలనే జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా ఇన్సూరెన్స్ ని విధిగా చేయించుకోవాలని తెలిపారు. రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించడం కోసం లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని తద్వారా డబ్బు సమయం ఆదవుతుందని ఇరువురు మనసులను గెలుచుకోవచ్చని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.దీప తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం భార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుబ్రోలు రాంప్రసాదరావు, జిల్లా లీగల్ సర్వీసెస్ సభ్యులు తోట మల్లేశ్వరరావు,మెండు రాజమల్లు ఎండీ సాధిక్ పాషా, రమణ ములకలపల్లి ఎస్సై, కానిస్టేబుల్స్, సర్పంచులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు