మన్యం న్యూస్, చండ్రుగొండ, జనవరి 07..మండలంలో మద్దుకూరు గ్రామం లో కుంజా రామకృష్ణ కృష్ణవేణి దంపతుల కుమార్తె శాన్వి ఇటీవలే ప్రమదశాత్తు నీటి తొట్టిలో పడి మృతి చెందింది. విషయం తెలుసుకున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం శనివారం మృతి చెందిన చిన్నారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించి వారికి ప్రగాడ సానుభూతి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో చండ్రు గొండ మండల క్రైస్తవ ఫెలోషిప్ అధ్యక్షులు ఏసురత్నం, పార్టీ నాయకులు బీరవెల్లి ప్రసాద్, చేపా జోగారావు, వాడే నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.