భద్రాచలం పై బి ఆర్ ఎస్ జెండా ఎగరవేస్తాం
*నూగురు వెంకటాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదే బోయిన బుచ్చయ్య
*బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు. మన్యం న్యూస్ ,వాజేడు:
మండలంలో గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయితీలోనీ సుదరయ్య కాలనిలో 30 కుటుంబాలు గుమ్మడిదొడ్డి సర్పంచ్ పాయం విజయలక్ష్మి ,బిఆర్ఎస్ నాయకులు పాయం జానకిరమణ, నాంపల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ఆ పార్టీ లో చేరారు .వీరిని నూగురు వెంకటాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదే బోయిన బుచ్చయ్య వారిని బి ఆర్ ఎస్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించినారు.ఈ కార్యక్రమంలో వాజేడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెను మళ్లు రామకృష్ణారెడ్డి, స్థానిక ఎంపీటీసీ బీర బోయిన పార్వతి, కంబాలపల్లి గణపతి , ఉపాధ్యక్షులు కొత్తగట్టు సాంబమూర్తి ,ఆత్మ డైరెక్టర్ గొడుగులూరి మోహన్ రావు , మండల కోశాధికారి పోలూరి వేణుగోపాలరావు, మండల యూత్ జాయింట్ సెక్రెటరీ యువరాజ్ ,మండల జాయింట్ సెక్రెటరీ చెన్నం సాంబశివరావు, మొడం ప్రకాష్, మునిగొండ రమేష్, మొడం సందీప్, ముత్తబోయిన శ్రీనివాస్, ముత్యబోయిన గిరిబాబు ,పద్మా, మండల సోషల్ మీడియా వారియర్ అల్లి ప్రశాంత్ కుమార్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.