మన్యం న్యూస్, సారపాక :
బూర్గంపాడు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బూర్గంపాడు ఎస్సై సంతోష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… శనివారం ఉదయం సారపాక పట్టణంలో బూర్గంపాడు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతూ తిరుగుతూ కనిపించిన ఇద్దరు వ్యక్తులను బూర్గంపాడు పోలీసులు వెంబడించి పట్టుకొని విచారించారు. విచారణలో సారపాక గాంధీనగర్ వాంకుడోత్ సాయి , అన్నపురెడ్డిపల్లికి చల్లా వెంకటేశ్వర్లు చెందిన వ్యక్తులుగా వారిని గుర్తించారు. వీరు ఇరువురు జల్సాలాకు అలవాటుపడి గత సంవత్సరం మార్చిలో సారపాక పంచాయతీలోని రాజీవనగర్ కాలనీలో ఎవరూ లేని ఇంటిని చూసి ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి వస్తువులు దొంగిలించరాని ఒప్పుకున్నారు. వీరు దొంగిలించిన వస్తువులను పోలీస్ వారు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 4లక్షల రూపాయలు ఉంటుంది తెలిపారు. తదనంతరం దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులను రిమాండ్ కు తరలించారు. దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను చాకచక్యంగా వ్యవహరించిన బూర్గంపహాడ్ పోలీసులను స్థానికులు, ఉన్నతధికారులు అభినందిస్తున్నారు.