మన్యం న్యూస్, అశ్వారావుపేట, జనవరి 8: మండల పరిధిలోని ఆనంతారం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పాయం చినకామయ్య అనారోగ్యం తో ఆదివారం మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి వారీ నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి ఘన నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు ఎంపిటిసి కుమారి, మల్లాయిగూడెం సర్పంచ్ నారం రాజశేఖర్, మాజి ఎంపీపీ బరగడ కృష్ణ, నాయకులు సూరిబాబు, మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.