మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 08: పినపాక నియోజక వర్గంలోని మణుగూరు లో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ క్రీడలు ఆదివారం అట్టహాసంగా కొనసాగాయి. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు క్రీడలను కొనసాగించారు. క్యాంపు కార్యాలయంలో షటిల్, క్యారమ్స్, చెస్ పోటీలు నిర్వహించగా జడ్పి కో-ఎడ్యుకేషన్ హై స్కూల్ లో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు. దగ్గరుండి క్రీడలను వీక్షించారు. అంతే కాకుండా క్రీడలు ఆడుతున్న క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. వారిలో ఆత్మా విశ్వాసాన్ని పెంచి క్రీడా స్ఫూర్తిని నింపారు. ఈ క్రీడలను వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.