మన్యంన్యూస్, మణుగూరు, జనవరి 08: మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మండలంలోని సింగారంకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ సారథ్యంలో ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, కుర్రి నాగేశ్వరరావు, జావిద్ పాష, ఏనిక ప్రసాద్, వెంకట్ రెడ్డి, గణేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.