మన్యం న్యూస్ అశ్వాపురం:
అశ్వాపురం మండల కేంద్రంలో ఆదివారం టీడీపీ పార్టీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షులు తుళ్ళూరి ప్రకాష్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పినపాక తెలుగుదేశం పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ తాత మాధవి లతనియామకం పార్టీకి విధి విధానాలకు విరుద్ధంగా,అర్హత లేని సమర్ధత లేని వారిని ఏకపక్షంగా నియమించటాన్ని నిరసిస్తూ…ఇంచార్జ్ నియామకాన్ని వెంటనే రద్దుచేయ్యాలని డిమాండ్ చేశారు. పినపాక నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడాలని అశ్వాపురం మండల తెలుగుదేశం పార్టీ సమావేశం ఏకగ్రీవ తీర్మానించడమైనది.ఈ తీర్మాన లెటర్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి పంపడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తుళ్ళూరి గంగా భవాని ,సీనియర్ నాయకుడు కూరపాటి చలపతి రావు,(కేసీఆర్) సాయిన్ని సంపత్ కుమార్,కొర్లకుంట నరేష్,మల్లెల నరసింహారావు,నంబూరి జానకిరామయ్య,టీడీపీ వాసు,మహిళా నాయకురాలు కే.పద్మ,తుళ్ళూరి రమేష్,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.