UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 పోడు భూముల సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇస్తాం

మన్యం న్యూస్,చండ్రుగొండ:
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దారం గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ములకలపల్లిజడ్పిటిసి,టీపీసీసీ మెంబర్ సున్నం నాగమణి ఆదివారం విస్తృతంగా పర్యటించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పోడు భూముల సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇస్తాం అన్నారు . ఆమె ఆదివారం వెంకట తండా, రవికంపాడు పంచాయతీలలో విస్తృతంగా పర్యటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాo , పోడు భూముల సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇస్తామని , సొంత స్థలాలలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తామని అన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ కూడా వివరిస్తూ గ్రామాలలో పర్యటించడం జరిగింది . వెంకట తండా గ్రామంలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని , వీధిలో ఉన్న కరెంటు స్తంభాలు రోడ్డు మీదే ఉన్నాయని నా దృష్టికి తెలియపరిచిన వెంటనే కరెంట్ డిఈ తో మాట్లాడటం జరిగింది.ఈ సందర్భంగా కరెంట్ డిఈ సానుకూలంగా స్పందించినట్లు ఆమె అన్నారు . ఈ కార్యక్రమంలో చీకటి శ్రీనివాసరావు జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి , రెడ్డి పోగుల సురేష్ , మద్దిబోని సీతారాములు, మద్దిబోని పుల్లయ్య ,రంగిశెట్టి రాము , కుంచపు కాశి, బానోతు వీరన్న , బానోత్ సత్యం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !