సీఎంకెసిఆర్ పథకాలు ఏజెన్సీ ప్రజలకు శ్రీరామరక్ష:
వెంకటాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య
ముఖ్యమంత్రి కెసిఆర్ పథకాలు ఏజెన్సీ ప్రజలకు శ్రీరామరక్ష అని వెంకటాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య మన్యం న్యూస్ తో అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకంపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, 10, 20 ఎకరాలలో భూమి ఉన్న ఏజెన్సీ ఆదివాసి రైతులకు రైతుబంధు పడుతున్న విషయం మరువ కూడా దన్నారు. దళిత బంధుతో దళితుల జీవితాలు మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తుంటే… భద్రాచలం ఎమ్మెల్యే అనుచరులు రాబందుల వలే లబ్ధిదారుల నుండి కమిషన్లు వసూలు చేయడం దుర్మార్గపు చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాల మూలంగా ప్రజలు ఏ లోటు లేకుండా జీవిస్తున్నారని, రానున్న ఎలక్షన్ లో భద్రాచలం నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగరవేస్తామని అన్నారు. వరదల సమయంలో ఏజెన్సీ బెంబలెత్తిపోతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ ఎప్పటికీ మరువలేమన్నారు. తమపై ప్రేమ చూపిన సీఎం కేసీఆర్ కి భద్రాచలం నియోజకవర్గాన్ని కానుకగా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.