UPDATES  

 ఉత్సాహంగా టూ కే రన్ పోటీలు…. -రన్నింగ్ ఆరోగ్యానికి సూచిక.

ఉత్సాహంగా టూ కే రన్ పోటీలు….
-రన్నింగ్ ఆరోగ్యానికి సూచిక.
– అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి.
– సీఎం కేసీఆర్ కు అందరి ఆశీస్సులు ఉండాలి.
-పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.
మన్యంన్యూస్, మణుగూరు, జనవరి 08: రన్నింగ్ అనేది మంచి ఆరోగ్యానికి సూచిక అని రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మణుగూరు పట్టణంలో మహిళలకు నిర్వహించిన 2కే రన్ పోటీలను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ఎంత ఉత్సాహంగా తెల్లవారుజామునే 200 ల మంది మహిళలు పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. భద్రాద్రి రాముడి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని, దీనివలన ఆరోగ్యంగా ఉంటామన్నారు. సీఎం కేసీఆర్ కు ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఉండాలన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి 10 వేల రూపాయల విలువ గల గిఫ్ట్, రెండవ బహుమతి 8 వేల రూపాయల విలువ గల గిఫ్ట్, మూడవ బహుమతి 6 వేల విలువ గల గిఫ్ట్, కన్సోలేషన్ బహుమతి కింద 4వేల రూపాయల విలువ గల గిఫ్ట్ అందజేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు 2 వేల రూపాయల విలువ గల చీరలను అందజేస్తామన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో జడ్పిటిసిలు, ఎంపీపీలు, మండల అధ్యక్షులు, పెద్దలు స్థలాన్ని కేటాయిస్తారని, ఆ స్థలంలోనే ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు అక్కడే బహుమతులు అందజేస్తారన్నారు. 13వ తేదీన జడ్పికో ఎడ్యుకేషన్ హై స్కూల్లో పిల్లలకు పెద్దలకు వేరువేరుగా సాంస్కృతిక పోటీలు నిర్వహించడం జరుగుతుందని, పెద్ద సంఖ్యలో అందరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో నృత్యాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రేగా కాంతారావు జడ్పీ హైస్కూల్లో వంటల పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
పోటీల్లో విజేతలు వీరే…
మణుగూరు పట్టణంలో నిర్వహించిన 2కే ఒక రన్ పోటీల్లో అండర్ 15 విభాగంలో మొదటి బహుమతి స్వాతి, రెండవ బహుమతి యశస్విని, మూడో బహుమతి బేబీ, నాలుగవ బహుమతి శ్రీ వర్ష, అండర్ 40 విభాగంలో మొదటి బహుమతి కాశీ మల్ల పద్మ, రెండవ బహుమతి విజయలక్ష్మి, మూడవ బహుమతి వినీల, నాలుగవ బహుమతి లీల, అండర్ 50 విభాగంలో మొదటి బహుమతి కౌర్, రెండవ బహుమతి లక్ష్మి, మూడవ బహుమతి సుబ్బలక్ష్మి, నాలుగవ బహుమతి మాధవిలు విజేతలుగా నిలిచారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !